new teaching hospitals in AP: రాష్ట్రంలోని వైఎస్ఆర్ కడప, విజయనగరం,తూర్పుగోదావరి జిల్లాల్లో మూడు బోధనాసుపత్రుల నిర్మాణానికి నాబార్డు రుణం మంజూరు చేసినట్టు ఆ సంస్థ సీజీఎం సుధీర్ కుమార్ జన్నావర్ వెల్లడించారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, ఉభయగోదావరి జిల్లాల్లోని ఐటీడీఏ ప్రాంతాల్లో 5 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం కోసం మొత్తంగా 1392 కోట్ల రూపాయల రుణం మంజూరు చేసినట్టు తెలిపారు. నాబార్డు రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఈ మొత్తాన్ని ఇస్తున్నట్టు వివరించారు.
ఏపీలో వైద్యపరమైన సౌకర్యాలు మెరుగుపర్చటంతో పాటు గిరిజన ప్రాంతాల్లో సకాలంలో వైద్య సేవలందించేందుకు వీలుగా ఈ రుణాన్ని వ్యయం చేయనున్నట్టు పేర్కొన్నారు. బోధనాసుపత్రుల్లో మేజర్ ఆపరేషన్ థియేటర్, క్లినికల్ ఓపీడీలు, డయాలిసిస్, బర్న్ వార్డు, క్యాజువాలిటీ వార్డు, ప్రత్యేకంగా క్లినికల్ కమ్ సర్జికల్ వార్డులు, ఆక్సిజన్ ప్లాంట్ ల సదుపాయం ఉటుందని వెల్లడించారు. అలాగే గిరిజన ప్రాంతాల్లోని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో కన్సల్టేషన్ రూమ్, ఆయూష్ క్లీనిక్, ట్రీట్మెంట్ ప్రోసీజర్ రూమ్ , డయాలసిస్ వార్డు, డయాగ్నస్టిక్ ల్యాబ్ పీడియాట్రిక్, ఆర్థోపెడిక్ వార్డులు అందుబాటులో ఉండేలా నిర్మాణం చేపడతారని నాబార్డు తెలిపింది. అటు పాఠశాలల్లోని నాడు నేడు కార్యక్రమం కోసం 3092 కోట్ల రూపాయల్ని నాబార్డు రుణంగా ఇచ్చినట్టు వెల్లడించారు.
ఇదీ చదవండి: Pattabhi fires on CM Jagan: ఉద్యోగులను నమ్మించి.. నట్టేట ముంచారు: తెదేపా నేత పట్టాభి