కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం చౌదరివారిపల్లె మడేరు వంక వద్ద గత నెల 28న మడేరు వంక వద్ద 142 దుంగలను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈకేసుకు సంబంధించి చాపాడు మండలం రేపల్లెకు చెందిన పి.వెంకటేశ్వర్లు, దువ్వూరు మండలం బుక్కాయపల్లెకు చెందిన తప్పెట బయపురెడ్డిలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి మరో ఆరు ఎర్రచందనం దుంగలు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు మైదుకూరు డీఎస్పీ బి.విజయ్‌కుమార్ తెలిపారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండీ.. ఆగని రెమ్‌డెసివిర్ దందా.. వైద్య సిబ్బంది ప్రమేయంతో నల్లబజారుకు