ETV Bharat / state

కొవిడ్​తో వృద్ధురాలు మృతి.. అంత్యక్రియలు నిర్వహించిన పురపాలక సిబ్బంది - masapet latest news

కరోనాతో మరణించిన వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబసభ్యులు కూడా వెనుకాడుతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. తాజాగా కడప జిల్లా రాయచోటి మండలం మాసాపేటలోనూ ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. చివరికి... పురపాలక సిబ్బంది.. కొవిడ్​తో మరణించిన వ్యక్తికి అంత్యక్రియలు చేయాల్సి వచ్చింది.

funeral
అంత్యక్రియలు
author img

By

Published : May 30, 2021, 10:04 AM IST

కడప జిల్లా రాయచోటి మండలం మాసాపేటలో కొవిడ్​తో మరణించిన ఓ వృద్ధురాలికి పురపాలక సిబ్బంది అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు. కరోనా సోకి పది రోజులుగా చికిత్స పొందిన ఆ వృద్ధురాలు నిన్న మృతి చెందారు. ఆమెకు అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబసభ్యులెవరూ ముందుకు రాలేదు.

స్థానికులు పురపాలక అధికారులకు సమాచారం అందించారు. కమిషనర్​ రాంబాబు వెంటనే స్పందించారు. కార్యాలయ సహాయకుడు మల్లికార్జున, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి వృద్ధురాలి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు.

ఇదీ చదవండి:

కరోనా రోగుల వైద్యానికి.. ఉదార హృదయంతో దాతల సాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.