రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధే ముఖ్యమంత్రి ధ్యేయమని వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాయలసీమకు హైకోర్టు రావడం తెదేపా నేతలకు ఇష్టం లేదని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు లక్షకోట్ల వ్యయంతో అమరావతి నిర్మాణం సాధ్యమేనా అని.. వారు ప్రశ్నించారు. అమరావతిలో తెదేపా నేతల ఆస్తుల విలువ పెంచుకునేందుకే ఉద్యమాలు చేస్తున్నట్లు ఆరోపించారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలో తెలుగుదేశం నేతలపై ప్రజలు తిరగబడే పరిస్థితి వచ్చిందన్నారు.
ఇదీ చదవండి: