కడప జిల్లా రాయచోటి మండలం శిబ్యాలలో విషాదం జరిగింది. నీటి గుంతలో పడి తల్లీకుమారుడు మృతి చెందారు. గ్రామానికి చెందిన గువ్వల లక్ష్మీదేవి(25).. కుమారుడు నిఖిల్ (4)తో కలిసి.. బట్టలు ఉతకడానికి నీటి గుంత వద్దకు వెళ్లింది. ఉతుకుతుండగా.. నిఖల్ ప్రమాదవశాత్తు గుంతలో పడిపోయాడు. కుమారుడిని కాపాడటానికి.. ఆమె నీటి గుంతలోకి దిగింది.
బురద ఊబిలో చిక్కుకుని తల్లీ, కుమారుడు మరణించారు. సమాచారం అందుకున్న రాయచోటి పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని.. మృతదేహాలను వెలికి తీశారు. శవ పరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ జి.రాజు తెలిపారు.
ఇదీ చదవండి: