ఈ నెల 21న పులివెందుల నియోజకవర్గంలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేసిన తేదేపా అభ్యర్థులకు రక్షణ కల్పించాలని కోరుతూ కడప ఎస్పీ అన్బురాజన్‌కు తెదేపా నేత బీటెక్ రవి వినతిపత్రాన్ని అందజేశారు. ముఖ్యంగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు మరింత దారుణంగా ఉందని పేర్కొన్నారు. నామినేషన్ వేసిన తెదేపా మద్దతుదారులను పోలీసులు అనవసరమైన కేసుల్లో ఇరికించి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారని తెలిపారు. పోలీస్ స్టేషన్‌కు వెళితే.. అభ్యర్థి అనే విషయం తమకు తెలియదని మాట్లాడుతున్నారని బీటెక్ రవి పేర్కొన్నారు. వైకాపా నేతల నుంచి ఒత్తిడి పెరుగుతోందని.. అభ్యర్థులకు రక్షణ కల్పించాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేశారనే కోపంతో వైకాపా నాయకులు అభ్యర్థుల పంట పొలాలను నాశనం చేస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి: 'కావాలనే వాళ్ల నామినేషన్లు తిరస్కరిస్తున్నారు.. న్యాయం చేయండి'