కడప జిల్లా మైలవరం మండలం నవాబుపేట గ్రామంలో కరోనా పాజిటివ్ కేసులు 81కి చేరాయి. జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.. ఎంపీడీఓ, రెవెన్యూ, వైద్య, పోలీసు సిబ్బందితో కలిసి ఆ ప్రాంతంలో పర్యటించారు. గ్రామంలో ఉండే ప్రజలు ఎవరూ బయట తిరగొద్దని కోరారు. నవాబుపేట గ్రామంలో అందరు విధిగా మాస్కులు ధరించాలన్నారు. లేదంటే జరిమానా విధించాలని అధికారులకు ఆదేశించారు.
గ్రామంలో ఇప్పటివరకు దాదాపు1300 మంది నుంచి నమూనాల సేకరించామని ఎమ్మెల్యే వెల్లడించారు.వీరి ఫలితాలు త్వరలోనే వస్తాయన్నారు. 24 గంటలూ పనిచేసేలా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని ఎమ్మార్వో, వైద్య అధికారులను ఆదేశించారు.
ఇదీ చూడండి: