సాధారణ రైతుల మాదిరిగానే కౌలురైతులకు కూడా వైఎస్సార్ రైతు భరోసా, ఇన్సూరెన్సు వర్తిస్తుందని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తెలిపారు. కడప జిల్లా ఉప్పలపాడు గ్రామంలో కౌలురైతులకు ఎమ్మెల్యే పత్రాలు అందించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిచడమే కాకుండా, దాదాపు మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ప్రతి రైతు తను వేసిన పంటలకు ఈ క్రాప్ నమోదు చేయించుకోవాలని అన్నారు. త్వరలోనే రైతు భరోసా కేంద్రాలలో రైతులకు కావలసిన అన్నిరకాల ఎరువులను ప్రభుత్వం సిద్ధం చేస్తున్నదని తెలిపారు.
ఇదీ చూడండి