కడప జిల్లా కమలాపురం మండల పరిషత్ అభివృద్ది కార్యాలయంలో వాలంటీర్లను ఘనంగా సన్మానించారు. మండలంలోని సుమారు 1033 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రతీ పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడానికి సీఎం జగన్.. వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గౌతమి, స్పెషల్ ఆఫీసర్ చిన్నరాముడు, అడిషనల్ ఎస్పీ దేవప్రసాద్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి...