ప్రభుత్వ నిబంధనల ప్రకారం కార్మికులతో 8 గంటలు మాత్రమే పని చేయించుకోవాల్సి ఉండగా కొందరు 12 గంటలు వెట్టిచాకిరి చేయిస్తున్నారని ఏఐటీయూసీ కడప జిల్లా ప్రధాన కార్యదర్శి నాగ సుబ్బారెడ్డి ఆరోపించారు. జిల్లా సీపీఐ కార్యాలయంలో ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో పనిచేస్తున్న కార్మికులతో సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వం స్పందించి వసతి గృహంలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం రూ. 21వేల ఇవ్వాలని డిమాండ్ చేశారు. నూతన సిబ్బంది నియామకం చేపటకపోవడం వల్ల ఉన్న సిబ్బందిపై అధిక పనిభారం పడుతోందని ఏఐటీయూసీ కడప జిల్లా ప్రధాన కార్యదర్శి నాగ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. సిబ్బందికి కనీస ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
'కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన అమరావతి ఐకాస నేతలు'