ఖరారైన రాజంపేట వైకాపా అభ్యర్థిత్వం సీనియర్ నాయకుడిగా, రాజంపేట వైకాపాలో ఎంతో కాలంగా సేవచేస్తున్న అమర్ నాథ్ రెడ్డి, ఆ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. తాజాగా వైకాపాలో మేడ మల్లికార్జున రెడ్డి చేరికతో, అమర్నాథ్ రెడ్డి వర్గంలో తీవ్ర అంసతృప్తి ఏర్పడింది. ఈ నేపథ్యంలో వైకాపా అధినేత జగన్ ఆదేశాల మేరకు, ఆ పార్టీ మాజీ ఎంపీ మేడ మిథున్ రెడ్డి సమక్షంలో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. ప్రభుత్వ విప్‌గా ఉంటూ వైకాపాలో చేరిన మేడ మల్లికార్జున రెడ్డి తొలిసారిగా ఆ పార్టీ సీనీయర్ నాయకుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డితో సమావేశమయ్యారు.
ఇరునేతల భేటీ అనంతరం రాజంపేట అభ్యర్థిత్వంపై సందిగ్ధత వీడింది. రానున్న ఎన్నికల్లో రాజంపేట నుంచి మేడ మల్లికార్జున్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మిధున్ రెడ్డి కోరారు. పార్టీలో చేరిన కొత్తంవర్గంతో అంతా కలిసికట్టుగా పనిచేయాలని ఆయన కోరారు. జగన్ను సీఎం చేయాలనే లక్ష్యంగా పనిచేయాలని, ఎక్కడ ఎవరి మధ్య మనస్పర్థలు లేవని ఆయన తెలిపారు.