Praveen Kumar Reddy bail petition: హైకోర్టులో బెయిల్ పిటిషన్ కోసం ప్రొద్దుటూరు పోలీసులు సీడీ ఫైల్ ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి భార్య మౌనిక రెడ్డి వై.ఎస్.ఆర్ కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్‌కు విజ్ఞప్తి చేశారు. తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆమె ఇవాళ ఎస్పీని కలిశారు. గత నెల 13న ప్రొద్దుటూరులో ప్రవీణ్ ఇంటిమీద వైకాపా కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఇరువర్గాలు మధ్య గొడవ జరిగింది. ఆ మరుసటి రోజు ప్రవీణ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ప్రవీణ్ రెడ్డి 20 రోజుల నుంచి కడపజైల్లో ఉన్నారు.
ఇటీవల ప్రొద్దుటూరు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు తిరస్కరించింది. దీంతో హైకోర్టును ఆశ్రయించారు. రెండు రోజుల కిందట బెయిల్ పిటిషన్ పై విచారణ జరపగా... ప్రొద్దుటూరు పోలీసులు కేసుకు సంబంధించిన సీడీ ఫైల్ ఇవ్వకుండా జాప్యం చేశారు. ఫలితంగా ఈనెల 9వ తేదీకి విచారణ వాయిదా పడింది. మరోసారి సీడీ అధికారులు ఫైల్ జాప్యం చేయకుండా వెంటనే పోలీసులను అప్రమత్తం చేయాలని కోరుతూ మౌనికా రెడ్డి, శ్రీనివాసులరెడ్డి ఎస్పీ అన్బురాజన్ ను కలిసి కోరారు. తక్షణమే సీడీ ఫైల్ ను హైకోర్టు పంపే విధంగా చర్యలు తీసుకుంటానని ఎస్పీ హామీ ఇచ్చినట్లు తెదేపా నేతలు తెలిపారు. ప్రవీణ్ రెడ్డికి బెయిలు రాకుండా చేయడానికి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారని పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి ఆరోపించారు.
ఇవీ చదవండి: