ETV Bharat / state

చెట్లకే మాగిపోతున్న మామిడికాయలు

author img

By

Published : Apr 23, 2020, 12:23 PM IST

కరోనా మహమ్మారి.. మామిడి రైతులపైనా తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. దిగుబడులు చేతికొచ్చి అమ్ముకునే సమయంలో లాక్‌డౌన్‌ ప్రభావం వల్ల మామిడి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కడప, ప్రకాశం జిల్లాల పరిధిలో చెట్లకున్న కాయలను కోసేందుకు కూలీలు దొరక్క, కొనేందుకు వ్యాపారులు రాక, వచ్చినా సరైన గిట్టుబాటు దక్కక తీవ్రంగా నష్టపోతున్నామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

mango farmers problems at kadapa district
కడప జిల్లాలో మామిడి రైతుల కష్టాలు
కడప జిల్లాలో మామిడి రైతుల కష్టాలు

ఫలాల్లో రారాజు... మామిడి. బంగినపల్లి మామిడి కాయలంటే ఇక చెప్పనవసరం లేదు. అంత మధురమైన రుచి వాటి సొంతం. కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పండ్ల తోటలకు ప్రసిద్ధి. ఇక్కడ మామిడి, అరటి, బొప్పాయి పంటలు ఎక్కువగా పండిస్తారు. 30 వేలకు పైగా ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో కురిసిన వర్షాల ప్రభావంతో.. మామిడి పూత, పిందె ఆలస్యంగా వచ్చింది. ఈ ప్రభావం దిగుబడులపై పడింది.

మామిడి పూత వచ్చే సమయంలో కురిసిన అకాల వర్షాలకు పూత రాలిపోవటంతో దిగుబడులు తగ్గాయి. ఎలాగోలా నిలిచిన దిగుబడులను అమ్మి సొమ్ముచేసుకుందామనుకున్న సమయంలో కరోనా ప్రభావం అడ్డుపడింది. ఇక ఎంతోకొంత వచ్చిన ఫలాన్ని అమ్ముకుందామంటే లాక్‌డౌన్‌తో రవాణా వ్యవస్థ నిలిచి పోయింది. సరైన సమయంలో మామిడి కాయలు తరలించటానికి వీలు లేకుండా పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక సీజనులో మామిడి కాయలు రాకపోవటంతో రైల్వే కోడూరు వద్ద మామిడికాయల యార్డు బోసిపోతోంది. వ్యవసాయ ఉత్పత్తులు సకాలంలో అమ్ముకునేందుకు ప్రభుత్వం అన్ని ప్రాంతాల్లో సడలింపులు ఇవ్వాలంటూ రైతులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

చేతికందిన పంట.. కుళ్లిపోతోంది సార్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.