కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం మంగంపేట గ్రామస్థులు ఏపీఎమ్డీసీ ముగ్గురాయి మైన్ వద్ద ఆందోళన చేశారు. స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలంటూ, మంగంపేట నిర్వాసితుల సంక్షేమ సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. స్థానికులకు కాకుండా ఇతరులకు ఉద్యోగాలు ఇస్తున్నారంటూ గ్రామస్థులు ఆరోపించారు. ఏపీఎండీసీ కోసం తమ భూములు, ఇళ్లను కోల్పోయిన తమకు కాకుండా వేరేవాళ్లకు ఉద్యోగాలు ఎలా ఇస్తారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మైనింగ్ కాలుష్యం వలన మంగంపేట, కాపుపల్లి, అరుంధతివాడ, అగ్రహారంలను డేంజర్ జోన్ గ్రామాలుగా గుర్తించి... సంవత్సరం గడుస్తున్నా పునరావాసం కల్పించలేదని వాపోయారు. బాధిత గ్రామస్థులకు పునరావాసం కల్పించి... ఉద్యోగాలు కల్పించాలంటూ విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: జిల్లాలో రోడ్డెక్కని ఆర్టీసీ అద్దె బస్సులు... యజమానుల్లో ఆందోళన