కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం జరిగింది . కొత్తపేట సమీపంలోని ప్లాట్ల వద్ద నరసమ్మ మహిళపై ఆటో డ్రైవరు హత్యాయత్నం చేశాడు. కత్తితో గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యాడు. నరసమ్మకు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరీశీలించారు. అప్పుగా ఇచ్చిన డబ్బులను అడగడంతో ఆటో డ్రైవరు.. మహిళపై కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. నిందితుడికి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇదీ చదవండి: LIVE VIDEO: అప్పు తీర్చమంటే మహిళను కాలితో తన్నేశాడు!