జడ్జి రామకృష్ణ పై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్ డిమాండ్ చేశారు. కడప ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రామకృష్ణ పై వైకాపా ప్రభుత్వం వ్యక్తిగత కక్షలకు వెళ్తోందని ఈశ్వర్ ఆరోపించారు. ప్రస్తుతం రామకృష్ణ కరోనాతో బాధపడుతున్నారని తక్షణం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడును నడిరోడ్డుపై కాల్చి చంపాలని అనడం కూడా దేశద్రోహం కిందికే వస్తుందని మరి ఆయనపై ఎందుకు కేసు నమోదు చేయలేదని ఎద్దేవా చేశారు. వైకాపా ప్రభుత్వానికి దళితులంటే గిట్టదని పేర్కొన్నారు. తక్షణం రామకృష్ణను విడుదల చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండీ..ధూళిపాళ్ల నరేంద్రను విచారించిన అ.ని.శా. అధికారులు