తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చేపట్టిన ప్రజా చైతన్య యాత్రకు మద్దతుగా కడప జిల్లా మైదుకూరులో.. పార్టీ నియోజకవర్గ బాధ్యుడు పుట్టా సుధాకర్ యాదవ్ ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు. నియోజకవర్గం నుంచి తరలి వచ్చిన కార్యకర్తలు, నాయకులు, ప్రజల సమక్షంలో పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలి నుంచి ఓంశాంతి నగర్ వరకు యాత్ర కొనసాగింది. పెద్దమ్మ వీధి ప్రవేశంలో ఏర్పాటు చేసిన సభలో సుధాకర్ మాట్లాడారు. వైకాపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
45 ఏళ్లకే పింఛన్లు మంజూరు చేస్తామని చెప్పి... ప్రభుత్వ ఇవ్వలేకపోయిందని, ఇసుక కొరతను సృష్టించి భవన నిర్మాణ కార్మికులను ఇబ్బందులకు గురిచేశారని విమర్శించారు. ఆర్టీసీ బస్సు, విద్యుత్ ఛార్జీలు పెంచారని అన్నారు. తొమ్మిది నెలల కాలంలో 47 వేల కోట్ల అప్పులు చేశారని మండిపడ్డారు. తెదేపా హయాంలో అమలు చేసిన నిరుద్యోగ భృతిని రద్దు చేసి నిరుద్యోగుల పొట్ట కొట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: