ETV Bharat / state

ఆలయ అర్చకుడి వినూత్న నిరసన.. ఆలయ గోపురం పైకి ఎక్కి ధర్నా - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

PRIEST PROTEST: ఎవరైనా ధర్నాలు, నిరసనలు, బైఠాయింపులు రోడ్లపై కానీ, ధర్నాచౌక్​ల దగ్గర లేదా ఇంటి ముందు చేయడం చూశాము. నాయకులు, కార్యకర్తలు అయితే పార్టీ ఆఫీస్​ల ముందు నిరసనలు చేస్తారు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి మాత్రం ఆలయ గోపురంపై ధర్నా చేస్తున్నాడు. అయితే ఆ వ్యక్తిని చూసి మీరు ఎవరో అనుకుంటే పొరపాటు.. ఎందుకంటే అతను ఎవరో కాదు.. స్వయానా ఆలయ అర్చకుడు. మరి ఆయన ఎందుకు నిరసన చేస్తున్నాడో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ కథనం మీ కోసమే..

PRIEST PROTEST
PRIEST PROTEST
author img

By

Published : Jul 31, 2022, 2:19 PM IST

PRIEST PROTEST: దేవాదాయశాఖ తలపెట్టిన వేలంపాట రద్దు చేసి తనకు రావాల్సిన బకాయిలను ఇవ్వాలంటూ ఓ ఆలయ అర్చకుడు వినూత్న రీతిలో ధర్నా చేపట్టాడు. తన సమస్యకు పరిష్కారం దొరికేంతవరకు దీక్ష విరమించేది లేదని తేల్చిచెప్పాడు.

వైఎస్ఆర్ జిల్లా పెద్దముడియం మండలం పెద్దపసుపుల గ్రామంలో మాధవరాయ స్వామీ ఆలయ ప్రధానార్చకులు మాధవాచార్యులు నిరసనకు దిగారు. ఆదివారం ఆలయం పక్కనే ఉన్న తేరు గుడిపై కూర్చొని దీక్ష చేపట్టారు. ఆగస్టు 2వ తేదీన నిర్వహించే వేలంపాటను రద్దుచేసి తనకు రావాల్సిన బకాయిలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. 1976 నుంచి ఆలయాన్ని కాపాడుకుంటూ వస్తున్నానని.. ఇప్పుడు దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకుని తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.