ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కట్టడికి పోలీసులు ,వైద్య, పారిశుద్ధ్య సిబ్బంది చేస్తున్న సేవలను ప్రజలు కొనియాడుతున్నారు. కడప జిల్లా జమ్మలమడుగు పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట ఓ న్యాయవాది పూజలు చేశారు. పోలీసులు ప్రాణాలకు తెగించి కరోనా కట్టడికి కృషి చేస్తున్నారంటూ.. పోలీస్స్టేషన్ ఎదుట టెంకాయలు కొట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు. పట్టణంలో లాక్ డౌన్ సందర్భంగా శిక్షణ డీఎస్పీ శ్రీపాదరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బలగాలు కవాతు నిర్వహించాయి. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ప్రజల సహకారం తప్పనిసరని డీఎస్పీ అన్నారు.
బద్వేలులో..
లాక్ డౌన్ అమలు తీరును తెలుసుకొనేందుకు కడప ఎస్పీ అన్బురాజన్ బద్వేల్లో ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కరోనా వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలపై క్షేత్ర స్థాయి పోలీసులతో ఆయన సమీక్షించారు. మాట వినకుండా నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై నిఘా పెట్టాలని సిబ్బందిని ఆదేశించారు. వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
ఇదీ చూడండి: