ETV Bharat / state

రహదారుల మధ్యలో గుంతలు తవ్వి గేట్లు ఏర్పాటు - కడపలో రోడ్లమీద గేట్లు ఏర్పాటు చేసిన న్యూస్

కడపలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతున్న కారణంగా అధికారులు లాక్​డౌన్​ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. నగరంలోని రహదారులపై గుంతలు తవ్వి గేట్లు ఏర్పాటు చేస్తున్నారు.

కడప రహదారుల మధ్యలో గేట్లు ఏర్పాటు చేసిన అధికారులు

author img

By

Published : May 5, 2020, 5:13 PM IST

కడపలో కారోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. కడప డీఎస్పీ సూర్యనారాయణ, ఆర్డీవో, నగరపాలక కమిషనర్, తహసీల్దార్​ నగరంలో ముమ్మరంగా పర్యటిస్తున్నారు. కడప రెడ్​ జోన్ ప్రాంతం అయినప్పటికీ వాహనదారులు తిరుగుతుండటంతో పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. రహదారుల మధ్యలో గుంతలు తవ్వి వాటికి గేట్లను ఏర్పాటు చేస్తున్నారు.

నగరం మొత్తం ఇదే విధంగా ఏర్పాటు చేయటంతో వాహనాలు తగ్గే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. కడప రవీంద్ర నగర్లో పాజిటివ్​ కేసు నమోదవటంతో ఆ ప్రాంతాన్ని అధికారులు రెడ్​జోన్​గా ప్రకటించారు. ఆ ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా నిషేధించాలని డీఎస్పీ చెప్పారు.

ఇదీ చూడండి: కడపలో మరింత కఠినంగా లాక్​డౌన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.