కరోనా కట్టడి నేపథ్యంలో చేపట్టిన లాక్ డౌన్ కార్యక్రమంలో భాగంగా కడప జిల్లాలో బంద్ కొనసాగుతోంది. ప్రజలను ఎప్పటికప్పుడూ పోలీసులు అప్రమత్తం చేస్తూ... కొవిడ్-19 వైరస్ వ్యాప్తి నిరోధంపై అవగాహన కల్పిస్తున్నారు.
రాజంపేటలో...
కరోనా లాక్ డౌన్‌తో పట్టణంలో రాకపోకలు స్తంభించాయి. నిత్యవసర వస్తువుల దుకాణాలు మాత్రమే తెరుచుకున్నాయి. డీఎస్పీ నారాయణ రెడ్డి బందోబస్తును పర్యవేక్షించారు. ప్రజలు గుమికూడకుండా నియంత్రిస్తున్నారు. అనవసరంగా రోడ్లపై వచ్చే వారిపై చర్యలు తీసుకుంటున్నారు.
కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు సామాజిక దూరాన్ని పాటించాలని జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. కడప జిల్లా రాజంపేటలో లాక్ డౌన్ అమలు తీరును ఆయన స్వయంగా పర్యవేక్షించారు. ద్విచక్ర వాహనాల్లో ఇద్దరు వెళితే కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. నిత్యావసర వస్తువుల దుకాణాల వద్ద క్యూలైన్లను ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు సూచించారు.
రైల్వేకోడూరులో...
రైల్వేకోడూరు నియోజకవర్గంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రధాన రహదారుల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎవరినీ ఇళ్ల నుంచి బయటకు రాకుండా కట్టడి చేస్తున్నారు. పట్టణంలో వ్యాపార సముదాయాలన్నింటినీ మూయించివేశారు. ప్రజలను ఎవరినీ ఇంటి నుంచి బయటకు రావొద్దు అంటూ ఆటోలతో ప్రచారం చేస్తున్నారు.
ఇవీ చూడండి: