కడప జిల్లాలో లాక్ డౌన్ అనంతరం రూ. 35 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. ఈనెల 4 నుంచి జిల్లాలో మొత్తం 126 మద్యం దుకాణాలు తెరిచారు. కడప నియోజకవర్గంలో రూ.19 కోట్లు, ప్రొద్దుటూరు డివిజన్లో రూ. 16 కోట్ల రూపాయల మందు అమ్మారు.
15వ తేదీ వరకు చూసిన అమ్మకాల ప్రకారం.. రోజుకు దాదాపు రెండున్నర కోట్ల విలువైన మద్యం తాగేశారు మందుబాబులు. గతంలో లేని కొత్త కొత్త బ్రాండ్లు రావటంతో మద్యం ప్రియులు వాటి రుచి చూస్తున్నారు.
ఇవీ చదవండి... 'ఆమె మృతదేహాన్ని మా గ్రామంలో ఖననం చేయొద్దు'