3 రోజుల క్రితం తమిళనాడులోని కర్నూరులో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహం కూల్చివేతను నిరసిస్తూ కడప జిల్లా మైదుకూరులో సీపీఐ, సీపీఎం, మాదిగ దండోరా నాయకులు నిరసన తెలిపారు. మార్కెట్ కూడలి నుంచి నాలుగు రోడ్ల కూడలి మీదుగా అంబేడ్కర్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన చేశారు. విగ్రహాలు కూల్చిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విగ్రహాన్ని కూల్చివేసిన ప్రాంతంలో తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా అంబేడ్కర్ విగ్రహాలకు రక్షణ కల్పించాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు.
తమిళనాడులో అంబేడ్కర్ విగ్రహం కూల్చివేతను నిరసిస్తూ ర్యాలీ - demolish
తమిళ నాడులోని కర్నూరులో అంబేడ్కర్ విగ్రహాన్ని కూల్చివేయటాన్ని నిరసిస్తూ వామపక్షపార్టీలు, మాదిగ దండోర నాయకులు మైదుకూరులో నిరసన ర్యాలీ నిర్వహించారు. దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
3 రోజుల క్రితం తమిళనాడులోని కర్నూరులో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహం కూల్చివేతను నిరసిస్తూ కడప జిల్లా మైదుకూరులో సీపీఐ, సీపీఎం, మాదిగ దండోరా నాయకులు నిరసన తెలిపారు. మార్కెట్ కూడలి నుంచి నాలుగు రోడ్ల కూడలి మీదుగా అంబేడ్కర్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన చేశారు. విగ్రహాలు కూల్చిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విగ్రహాన్ని కూల్చివేసిన ప్రాంతంలో తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా అంబేడ్కర్ విగ్రహాలకు రక్షణ కల్పించాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు.
నెలలు నిండని పసికందు మృతదేహం లభ్యం.
నరసరావుపేట పల్నాడు రోడ్డు చెక్ పోస్ట్ వీధిలో నెలలు నిండని పసికందు మృతదేహం స్థానికులను కలవరపరచింది. బుధవారం ఉదయం వీధి కాలువలో నెలలు నిండని బాలుడి మృతదేహం కాలువలో కొట్టుకు రావడంతో గమనించిన స్థానికులు వెంటనే ఆ మృతదేహాన్ని బయటకు తీశారు.
Body:అయితే అప్పటికే పసికందు మృతి చెంది ఉంది. పాల చర్మంతో బొడ్డు కూడా ఊడని పసికందు మృతదేహాన్ని చూసిన స్థానికులు ఒకటో పట్టణ పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
Conclusion:కాలువలో నీటి ప్రవాహం వేగంగా ఉండడంతో ఈ రోజు వేకువ జామున గుర్తు తెలియని వ్యక్తులు పసికందు మృతదేహాన్ని కాలువలో పడేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆర్.చంద్రశేఖరరావు,
ఈటీవీ రిపోర్టర్,
నరసరావుపేట,
9885066052.