పోలీసుల అనుమతి లేకుండా ధర్నాలు నిర్వహిస్తే కేసు నమోదు చేసి, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కడప జిల్లా ప్రొద్దుటూరు డీఎస్పీ ప్రసాదరావు తెలిపారు. పట్టణంలో ధర్నాలు చేయాలంటే ముందస్తుగా పోలీసుల నుంచి అనుమతి పొందాలన్నారు.
నిర్దేశిత ప్రాంతాల్లో మాత్రమే ధర్నాలు నిర్వహించుకోవాలని సూచించారు. ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ సమస్య సృష్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని సూచించారు. లేదంటే జరిమానాలు విధించి చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చదవండి: