కడప జిల్లా జమ్మలమడుగు మండలం గూడెంచెరువు గ్రామ సమీపం నుంచి... మైలవరం దక్షిణ కాలువ ప్రవహిస్తోంది. మైలవరం జలాశయంలో నీరు ఎక్కువగా ఉండటంతో... దక్షిణ కాలువకు వదిలారు. గండికోట రహదారిలో కాలువకు గండి పడి... భారీగా నీరు వృథా అవుతోంది. వారం రోజులుగా ఇలా వృథా అవుతున్నా... ఎవరూ పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 150 ఎకరాల్లో కోత దశలో ఉన్న వరి పొలాల్లోకి నీరు చేరిందని వాపోతున్నారు. దీనికి తోడు వరిగడ్డి ఆ ప్రవాహంలో కొట్టుకుపోతోందని రైతులు చెబుతున్నారు. అధికారులు స్పందించి కాలువకు పడిన గండ్లను పూడ్చాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి