బ్రహ్మంసాగర్‌కు కృష్ణా జలకళ కడప జిల్లా తెలుగు గంగ ప్రాజెక్టులో భాగమైన బ్రహ్మంసాగర్ జలాశయానికి కృష్ణా జలాలు చేరుతున్నాయి. గత నెల 18న కర్నూలు జిల్లా వెలుగోడు జలాశయం నుంచి నీటిని విడుదల చేయగా, నేటి నుంచి పూర్తి స్థాయిలో కృష్ణా ప్రవాహం బ్రహ్మంసాగర్‌ను చేరుకుంటున్నాయి. ఇప్పటివరకూ 1.54 టీఎంసీల నీరు నిల్వ ఉండగా మలో 12 టీఎంసీలు నిల్వ ఉంచటానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సన్నాహాలు చేస్తుండగా, సీపీఎం నాయకులు 15 టీఎంసీలు నిల్వ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం వెలుగోడు నుంచి 2500 క్యూసెక్కుల నీటి లెక్క చొప్పున బ్రహ్మంసాగర్ జలాశయానికి చేరుకుంటుంది.ఇదీ చదవండి : నెల దాటినా... 'స్పందన'లో పరిష్కారం కాని ఫిర్యాదు