ETV Bharat / state

కిట్టు అందక ఇక్కట్లు

author img

By

Published : May 5, 2021, 2:11 PM IST

కడప జిల్లాలో చాలామంది కరోనా వైరస్‌ బారిన పడుతున్నారు. అనుమానిత లక్షణాలు కనిపించకపోయినా, శ్వాస సమస్యలు, ఇతర ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేకపోతే హోం ఐసోలేషన్‌లోనే ఉండాలని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు భారీ సంఖ్యలో కొవిడ్‌ రోగులు ఇళ్లలోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. జిల్లాలో మంగళవారం నాటికి 5,639 క్రియాశీలక కేసులు ఉండగా.. ఇందులో 4,020 మంది హోం ఐసోలేషన్‌లోనే ఉంటున్నారు. వీళ్లందరికీ ప్రభుత్వం తరఫున ఉచితంగా కిట్లు అందజేయాల్సి ఉన్నా.. క్షేత్రస్థాయిలో కొందరికి అందట్లేదు. రోగుల్లో ఎక్కువగా జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు తదితర లక్షణాలతో ఉంటున్నారు. సకాలంలో మందులు అందితే త్వరగా కోలుకునే వీలుంటుంది. పాజిటివ్‌ వచ్చిందని నేరుగా రోగి ఫోన్‌ చేసి చెప్పినా సాంకేతిక కారణాలతో కొన్ని చోట్ల కిట్ల పంపిణీ ఆలస్యం అవుతోంది.

corona kit
corona kit

‘మా కుటుంబంలో నాతో కలిపి నలుగురు వ్యక్తులు వారంరోజుల క్రితం కరోనా బారిన పడ్డాం. అనుమానిత లక్షణాలు లేకపోవడంతో హోం ఐసోలేషన్‌లో ఉంటున్నాం. పాజిటివ్‌ వచ్చి ఒక రోజు గడిచిపోయినా ప్రభుత్వం అందించే కిట్‌ అందకపోవడంతో 104 కాల్‌సెంటరును సంప్రదించి సమస్యను తెలియజేశా. తర్వాత ప్రతిరోజూ జిల్లా యంత్రాంగం తరఫున ఎవరో ఒకరు ఫోన్‌చేసి మా బాగోగులు అడుగుతున్నారే తప్ప కిట్లు ఎప్పుడిస్తారంటే సరైన స్పందన లేదు. రెండురోజుల క్రితం స్థానిక వైద్య సిబ్బంది వచ్చి నలుగురికి కేవలం ఒక్క కిట్‌ ఇచ్చి వెళ్లారు. ఇదేంటని అడిగితే కిట్లు అందుబాటులో లేవని చెప్పారు’ అని కడప నగరం మరియాపురం ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి చెప్పారు.

‘నాకు మూడురోజుల క్రితం కరోనా సోకడంతో హోం ఐసోలేషన్‌లో ఉంటున్నా. ఇప్పటివరకు ప్రభుత్వం తరఫున కిట్‌ అందజేయలేదు. నాకు పెద్దగా ఇబ్బంది లేకపోవడంతో ప్రైవేటుగా కూడా ఔషధాలు తీసుకోవట్లేదు’ అని ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన ఒక యువకుడు పేర్కొన్నారు.

‘నాకు గత వారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొద్దిగా నీరసంగా ఉండడంతో ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతున్నా. ఇప్పటివరకు హోం ఐసోలేషన్‌ కిట్‌ అందించలేదు. దీనిపై స్థానిక వైద్య సిబ్బందిని అడిగినా స్పందన లేదు. చేసేదేమీలేక రూ.వెయ్యి ఖర్చుపెట్టి మందులు తెచ్చుకుని వాడుతున్నా’ అని కడప నగరానికి చెందిన ఒక మహిళ తెలిపారు.

‘ఈ నెల 2వ తేదీన నాకు కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. ఇప్పటివరకు నాకు కిట్‌ అందించలేదు. ప్రభుత్వం ఉచితంగా అందించే ఔషధాల కోసం ఎదురుచూస్తున్నా’ అని కడప నగరం ఎర్రముక్కపల్లెకు చెందిన ఒక వ్యక్తి చెప్పారు.

మూడురోజుల్లోపు అందించాలి

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పాజిటివ్‌ వచ్చి హోం ఐసోలేషన్‌లో ఉంటున్న రోగి ఇంటి వద్దకు మూడురోజుల్లోగా స్థానిక వైద్య సిబ్బంది వెళ్లాలి. వారికి పారాసిటమల్‌, యాంటీ బయాటిక్స్‌, విటమిన్‌- సి, డి, జింక్‌, బి-కాంప్లెక్స్‌, కాల్షియం తదితర మందులతో కూడిన కిట్టు అందజేయాలి. ఏ మాత్రలు ఏ సమయానికి వేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆహార నియమాలు, వ్యక్తిగత శుభ్రత.. సహాయకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై అవగాహన కల్పించాలి. కొన్నిచోట్ల ఈ ప్రక్రియ సమర్థంగా సాగుతున్నా.. మరికొన్నిచోట్ల రోగులు నిరీక్షించినా ఫలితం లేకపోవడంతో వారు రూ.వేలు ఖర్చుపెట్టి ప్రైవేటు వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. ప్రధానంగా కేసులు ఎక్కువగా నమోదవుతున్న కడప, ప్రొద్దుటూరులో రోగులకు ఇబ్బందులు తప్పట్లేదు. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితి ఆక్సిజన్‌ స్థాయిపై ఆధారపడి ఉంటుంది. 94 కంటే తక్కువగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. గతేడాది కరోనా తొలి దశ వ్యాప్తి మొదటిరోజుల్లో రోగులకు హోం ఐసోలేషన్‌ కిట్లలో పల్స్‌ ఆక్సీమీటర్లు, మాస్కులు, హైపోక్లోరైడ్‌ సొల్యూషన్‌ అందించేవారు. తర్వాత భారీ స్థాయిలో కేసులు నమోదవడంతో వాటి పంపిణీ నిలిపేశారు. ప్రస్తుతం వాటిని రోగులు ప్రైవేటుగా కొనుక్కోవాల్సి వస్తోంది. ప్రస్తుతం కేవలం ఔషధాలతో కూడిన కిట్లు మాత్రమే అందిస్తున్నా.. అవి కూడా కొందరికి అందని పరిస్థితి ఉంది.

పీహెచ్‌సీల్లో 6 వేల కిట్లు నిల్వ

జిల్లా అవసరాలకు తగినట్లుగా ప్రభుత్వం నుంచి కిట్లు సరఫరా అవుతున్నాయి. వాటిని పీహెచ్‌సీలకు అందించి, తర్వాత స్థానిక వైద్య సిబ్బంది ద్వారా రోగులకు పంపిణీ చేయిస్తున్నాం. జిల్లావ్యాప్తంగా ఉన్న పీహెచ్‌సీల్లో ప్రస్తుతం 6 వేల హోం ఐసోలేషన్‌ కిట్లు నిల్వ ఉన్నాయి. పీహెచ్‌సీలకు అవసరమైనదానికంటే 20 శాతం అదనంగా కిట్లు పంపిస్తున్నాం. ఎక్కడైనా కొన్ని పొరపాట్ల కారణంగా రోగులకు కిట్లు అందకపోయి ఉండొచ్ఛు అలాంటి సంఘటనలు మా దృష్టికి వస్తే వెంటనే అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. హోం ఐసోలేషన్‌లో ఉంటున్న వారికి అందుతున్న సౌకర్యాలపై రాష్ట్రస్థాయిలో ప్రత్యేకంగా ఐవీఆర్‌ఎస్‌ ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. ఇందులో ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లు తెలిస్తే వెంటనే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరించే ప్రక్రియ నిత్యం కొనసాగుతోంది. - అనిల్‌కుమార్‌, డీఎంహెచ్‌వో, కడప జిల్లా

ఇదీ చదవండి: 'మహమ్మారి'పై భయం వీడితేనే జయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.