అన్యాయం జరిగితే పెద్దలే కాదు.. చిన్నారులూ రోడ్డెక్కి ఆందోళన చేస్తారు అనడానికి ఉదాహరణే ఈ ఘటన. కడప వైఎస్సార్ క్రీడా పాఠశాలలో తమకు అన్యాయం జరిగిందని నాలుగో తరగతి విద్యార్థులు ధర్నా చేపట్టారు. అర్హులైన తమను కాదని 5, 6 తరగతుల విద్యార్థులకు సీట్లిచ్చారని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. స్పోర్ట్స్ స్కూల్ అధికారి డీఎస్డీవోపై విచారణ చేయించి.. తమకు న్యాయం జరిగేలా చూడాలని గోముగా వేడుకున్నారు. చిన్నారుల నిరసన తీరు చూపరులను ఆలోచింపజేసింది. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చదవండి