కడప జిల్లా రాయచోటిలో కార్తీక మాస ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శివాలయాలు భక్తులతో కళకళలాడాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు దీపాలు వెలిగించి... పరమేశ్వరునికి పూజలు చేశారు. దక్షిణ కాశీగా వెలుగొందుతున్న శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో స్వామి, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు.
ఆలయ ఆవరణంలోని అఘోర లింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. రాత్రికి అర్ధనారీశ్వర అలంకారంలో అఘోర లింగేశ్వరుడు భక్తులకు దర్శనం దర్శనమిస్తారని... ఆలయ అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: