ఇదీ చదవండి:
'వారి భూముల కోసమే... అమరావతిపై రగడ' - టీడీపీపై కన్నబాబు విమర్శలు
అమరావతిలో తెదేపా నేతలు కొన్న భూముల విలువ తగ్గుతుందనే.. చంద్రబాబు రాజధానిపై రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారన్న ఆయన.. పాలన వికేంద్రీకరణ లక్ష్యంగానే వైకాపా ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. మూడు రాజధానులకు మద్దతుగా రాష్ట్రపతికి పోస్టులు పంపే కార్యక్రమాన్ని అనంతపురంలో మంత్రి ప్రారంభించారు.
మూడు రాజధానులకు మద్దతుగా రాష్ట్రపతికి వైకాపా లేఖలు
అనంతపురంలో మూడు రాజధానులకు మద్దతుగా వైకాపా యువజన విభాగం రాష్ట్రపతికి పోస్టు కార్డులు పంపే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని మంత్రులు కన్నబాబు, శంకరనారాయణ ప్రారంభించారు. గాంధీజీ వర్ధంతి సందర్భంగా...ఆయన చిత్రపటానికి మంత్రులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడిన మంత్రి.. కుట్రలు, కుతంత్రాలతో రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు ప్రతిపక్షనేత చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. అమరావతిలో తెదేపా నేతలు కొన్న భూముల ధరలు తగ్గుతాయనే... రాజధానిని అమరావతిలో కొనసాగించాలని చంద్రబాబు పట్టుబడుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో 151 సీట్లు ఇచ్చిన ప్రజలు.. వైకాపా విధానాలను స్వాగతిస్తున్నారన్నారు.
ఇదీ చదవండి:
Intro:ATP :- రాష్ట్రంలో కుట్రలు కుతంత్రాలు సృష్టించే విధంగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు. అనంతపురం పర్యటన సందర్భంగా వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో అభివృద్ధి వికేంద్రీకరణ మూడు రాజధానుల అంశంపై పోస్ట్ కార్డులు పంపిణీ కార్యక్రమానికి ఆయన పాల్గొని మాట్లాడారు. తేదేపా నాయకులు కొన్న భూములకు ధరలు పెంచాలని నిర్ణయంతోనే రాజధాని అమరావతిలో కొనసాగించాలని చంద్రబాబు పట్టుబడ్డాడని దీనిని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఎన్నికల్లో 151 సీట్లు ఇచ్చిన ప్రజలు అభివృద్ధిని స్వాగతిస్తున్నారు. అలాగే జగన్మోహన్రెడ్డి తీసుకునే ప్రతి నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నామని తెలిపారు.
Body:బైట్..... కురసాల కన్నబాబు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి
Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.
Body:బైట్..... కురసాల కన్నబాబు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి
Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.