కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో పాపాగ్నినది వద్ద నిబంధనలకు విరుద్ధంగా వైకాపా నాయకులు ఇసుక తరలిస్తున్నారని... తెదేపా నేత పుత్తా నరసింహారెడ్డి ధ్వజమెత్తారు. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి నియోజకవర్గంలోనే భారీగా ఇసుక దందా సాగుతోందని ఆయన ఆరోపించారు. కొండూరు, మాచనూరు, పాపాగ్నినది ప్రాంతంలో నిబంధనల మేరకు 4 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వాల్సి ఉంటే... 20 లక్షల క్యూబిక్ మీటర్లు ఇప్పటికే తవ్వి తరలించారని ఆయన ఆరోపించారు.
ఈ మేరకు తమ వద్ద ఉన్న ఆధారాలతో స్పెషల్ ఎన్ ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ చక్రవర్తికి ఆయన ఫిర్యాదు చేశారు. 4వ తేదీన జిల్లా కలెక్టర్, ఎస్పీలతో పాటు ముఖ్యమంత్రికి ఫిర్యాదు కాపీ పంపిస్తామన్నారు. జిల్లాలో సాగుతున్న ఇసుక దందాను హైకోర్టు కూడా సుమోటో కింద తీసుకుని విచారణ చేయాలని... న్యాయమూర్తికి ఫిర్యాదు చేస్తామని పుత్తా నరసింహారెడ్డి తెలిపారు.
ఇదీచూడండి. ఈ క్వారంటైన్ కేంద్రంలో శుభ్రతే లేదు..!