ETV Bharat / state

'కొవిడ్ కేర్ సెంటర్​లో మెరుగైన సేవలు అందించాలి' - కొవిడ్ కేర్ సెంటర్​లో కడప జిల్లా కలెక్టర్ తనిఖీలు

కడప చెన్నూరు రోడ్డులో ఉన్న గ్లోబల్ ఇంజినీరింగ్ కాలేజీని కలెక్టర్ హరికిరణ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కశాశాలను కొవిడ్ కేర్ సెంటర్​గా ఉపయోగించుకునేందుకు అనువుగా తీర్చిదిద్దాలన్నారు. మౌలిక సదుపాయాలను త్వరితగతిన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

kadapa district collectorkadapa district collector

author img

By

Published : Jun 17, 2020, 10:48 PM IST

కొవిడ్ కేర్ సెంటర్​లో మెరుగైన సేవలు అందించాలని కడప జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కడపలోని చెన్నూరు రోడ్డులో ఉన్న గ్లోబల్ ఇంజనీరింగ్ కాలేజీని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాలను కొవిడ్ కేర్ సెంటర్​గా ఉపయోగించుకునేందుకు అనువుగా తీర్చిదిద్దాలన్నారు. గదుల మరమ్మతులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఫాతిమా కాలేజ్ నుంచి గ్లోబల్ కాలేజ్ వరకు వెంటనే రోడ్డును నిర్మించాలని నగరపాలక సంస్థ కమిషనర్​ను ఆదేశించారు. ఒక అంబులెన్స్​ను 24 గంటలూ అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు.

వైద్యులు, నర్సులు 24 గంటల పాటు రొటేషన్ పద్దతిలో కొవిడ్ కేర్ సెంటర్​లో అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. హోం క్వారంటైన్​కు వెళ్లే వారికి ఎలాంటి పద్ధతులు పాటించాలన్న అంశంపై కౌన్సెలింగ్ ఇప్పించాలని సూచించారు. ఆరోగ్య సేతు, పోలీస్ యాప్​ను తప్పని సరిగా ప్రతి ఒక్కరూ వినియోగించాలని చెప్పారు.

ఇదీ చదవండి

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...12 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.