కడప జడ్పీ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధం చేసినట్లు జడ్పీ సీఈవో సుధాకర్‌రెడ్డి తెలిపారు. ఈరోజు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జడ్పీ కార్యాలయం వద్ద 144 సెక్షన్ అమలులో ఉండడంతో అనుమతి ఉన్న వారిని మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. సిద్ధవటం జెడ్పీటీసీ నీలకంఠారెడ్డి వైకాపా నుంచి రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి డబ్బు, మద్యాన్ని కట్టడి చేస్తామన్నారని, స్థానిక నాయకులు డబ్బు ఇస్తే టిక్కెటు ఇస్తామని చెబుతున్నారని, తన వద్ద డబ్బు లేనందున రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు నీలకంఠారెడ్డి పేర్కొన్నారు. బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు.
ఇవీ చూడండి...