ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో.. బంగారంలాంటి పంటను రోడ్డుపై పారబోశారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని అంబకపల్లిలో ఈ సంఘటన జరిగింది. టమాటా పంటకు గిట్టుబాటు ధర లేదని కలత చెందిన అంబకపల్లి రైతులు టమాటాలను రోడ్డు పక్కన గుట్టలుగా పడేశారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి.. టమాటా రైతులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక అప్పులు మిగిలాయని రైతులు ఆవేదన చెందారు. సొంత నియోజకవర్గ ప్రజలకు ఏమీ చేయలేని సీఎం జగన్... రాష్ట్రానికి ఏం చేస్తారని లింగారెడ్డి విమర్శించారు. టమాటా రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: ఈ నెల 14 నుంచి 'రైతు కోసం తెలుగుదేశం'