కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె సమీపంలో.. ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి 2019 డిసెంబర్ 23న సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఏడాదిన్నరగా కరోనా ప్రభావంతో పనులు ముందుకు సాగలేదు. కేవలం రెండు కిలోమీటర్ల ప్రహరీ మాత్రమే ఏర్పాటైంది. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 279 మంది గ్రామస్థులకు.... సుమారు ఎకరం చొప్పున భూమి కేటాయించి పాస్‌బుక్‌లూ అందజేశారు. ఆన్‌లైన్‌లోనూ నమోదైన తమ పేర్లను శంకుస్థాపన జరిగాక తొలగించారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. జిల్లా అధికారుల వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవటంతో ఆందోళన బాటపట్టారు.
ఆందోళనల గురించి తెలుసుకుని ఇటీవల గ్రామంలో సభ ఏర్పాటు చేసిన వైకాపా నాయకులు.... ఐదు నెలల్లోగా అర్హులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కొందరు బాధితులు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని ఆశ్రయించగా... అవసరమైతే న్యాయపోరాటానికీ తమ పార్టీ సిద్ధమన్నారు. వైకాపా నేతల హామీతో గ్రామస్థులు తాత్కాలికంగా ఆందోళన విరమించారు.
ఇదీ చదవండి: