కడప జిల్లాలో పలు చోట్ల కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడం వల్ల... జిల్లా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కొరడా ఝళిపిస్తోంది. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నిబంధనలు అతిక్రమించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మొత్తం 848 కేసులు నమోదు చేసి... రూ.1.90లక్షలు జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణలో ప్రజలు తమ వంతు బాధ్యతను గుర్తించి పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.
ఇదీ చూడండి: 'నాటు సారా వద్దు.. పని కల్పిస్తాం చేసుకోండి'