గుహలో చిక్కుకున్న ముగ్గురు చిన్నారులను కాపాడిన పోలీసులకు కడప ఎస్పీ అన్బు రాజన్ నగదు రివార్డ్ అందజేశారు. కడప జిల్లా రాయచోటి మండలం మధవరం గ్రామానికి చెందిన ముగ్గురు పిల్లలు ప్రమాదవశాత్తు గుహలో చిక్కుకున్నారు. విషయం పోలీసులకు తెలియడంతో అర్బన్ పోలీసులు వెంటనే వెళ్ళి గుహలో ఉన్న ముగ్గురిని కాపాడారు. ఈ మేరకు ఎస్పీ పోలీసులను అభినందిస్తూ వారికి నగదు రివార్డ్ అందించారు.
ఇదీ చదవండి:కల్నల్ సంతోష్ వీర మరణం: ఈటీవీ భారత్ ప్రత్యేక కథనాలు