ETV Bharat / state

లాక్ డౌన్ తర్వాత పలు మార్పులతో రోడ్లపైకి బస్సులు

లాక్ డౌన్ తర్వాత ఆర్టీసీ బస్సులను పలు మార్పులతో రోడ్లపైకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. బస్సుల్లో సీట్ల కుదింపు, క్యాష్ లెస్ టికెట్ విధానం వంటి మార్పులను చేయనున్నారు. కడప జిల్లాలో బస్సుల్లో భౌతిక దూరం పాటించేలా సీట్లకు గుర్తులు వేస్తున్నారు. ఎప్పటినుంచి బస్సులు తిరుగుతాయో ఇంకా ఆదేశాలు రాలేదని.. అనుమతులు వచ్చేలోపు బస్సులను సిద్ధం చేస్తున్నామని కడప ఆర్​ఎం. జితేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.

kadapa rm jithendranath reddy interview
లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులలో మార్పులు
author img

By

Published : May 14, 2020, 5:52 PM IST

లాక్ డౌన్ తర్వాత రోడ్లపైకి వచ్చే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల మధ్య భౌతిక దూరం పాటించే విధంగా సీట్లను మార్చే ప్రక్రియను ఆర్టీసీ వేగవంతం చేసింది. కడప జిల్లాలో 8 డిపోల పరిధిలోని సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సులకు సీట్లు మారుస్తున్నారు. ఎక్స్ ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లోనూ భౌతికదూరం పాటించే విధంగా సీట్లకు క్రాస్ మార్కు వేస్తున్నామని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జితేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.

నిలబడ్డానికి అనుమతి లేదు...

ప్రతి బస్సులో 20 నుంచి 25 మంది ప్రయాణికులు మాత్రమే కూర్చునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఏ బస్సులోనూ నిలబడి ప్రయాణించేందుకు అనుమతి లేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని రూట్లకు బస్సులు అవసరమా లేదా అనేది ఆలోచన చేస్తున్నామన్న ఆయన... ఎప్పటి నుంచి బస్సులు తిరుగుతాయనేది ఇంకా ఆదేశాలు రాలేదన్నారు. అయితే అనుమతి వచ్చేలోపు బస్సుల మరమ్మతులు, సీట్ల కుదింపు వంటి చర్యలు చేపట్టామని చెప్పారు.

క్యాష్ లెస్ విధానం...

లాక్ డౌన్ తర్వాత కండక్టర్లు లేకుండానే క్యాష్ లెస్ వ్యవస్థ అమలు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. జిల్లాలో లాక్ డౌన్ కారణంగా ఆర్టీసీకి 50 కోట్ల రూపాయల నష్టం వచ్చిందన్నారు. ఆదాయాన్ని పెంచుకునేందుకు కార్గో సేవలను విస్తృతం చేస్తామని వెల్లడించారు.

ఇవీ చదవండి.. ఈటీవీ భారత్ ఎఫెక్ట్: గుంజన ఏరు వంతెనకు మరమ్మతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.