
కడప జిల్లాలోని ఎర్రగుంట్ల రోడ్డులో తిరుమల దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి ఫోన్‌కు జిల్లా ఎస్పీ స్పందించారు. మానసిక వికలాంగులైన తన ఇద్దరు కుమారులు, ఆర్థికపరిస్థితులతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానన్న ప్రసాద్‌కు ఊరట నిచ్చేలా ఎస్పీ చర్యలు తీసుకున్నారు. రూ. 5వేలు ఆర్థిక సహాయం, రెండు బస్తాల బియ్యం, నిత్యావసరాల సరుకులు అందించారు. అదేవిదంగా ప్రొద్దుటూరు ఎమ్మార్వో, ఎంపీడీఓలతో మాట్లాడి ప్రభుత్వం నుంచి పథకాలు అందేలా చూడాలన్నారు. బ్యాంకు మేనేజర్‌తో మాట్లాడి ఆ కుటుంబానికి సొంత ఆటో కోసం లోన్ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. తమను ఆదుకున్న ఎస్పీ గారికి జీవితాంతం రుణపడి ఉంటామని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇదీ చూడండి: విషాదం.. యంత్రంలో పడి బాలుడు మృతి