కడప జిల్లాలో రూ.18 కోట్లతో నిర్మించ తలపెట్టిన ఎస్పీ నూతన కార్యాలయ పనులకు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఎస్పీ అన్బురాజన్ పాల్గొన్నారు. ఎస్పీ కార్యాలయానికి గత డిసెంబరులో ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేయగా.. పరిపాలన అనుమతులు జనవరిలో వచ్చాయని ఎంపీ అవినాశ్ తెలిపారు. కరోనా కారణంగా పనులు ఆలస్యమయ్యాయని తెలిపారు.
జిల్లాలో పలు అభివృద్ధి పనులు, సాగునీటి ప్రాజెక్టులకు ఆగస్టులో టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా తెలిపారు. ఇప్పటికే వాటికి సంబంధించిన డీపీఆర్‌లు సిద్ధమవుతున్నాయన్నారు. సోమశిల వెనుక జలాల నుంచి కొప్పర్తి పారిశ్రామికవాడకు పైపులైన్ ద్వారా నీటిని మళ్లిస్తామన్నారు. ఏళ్ల తరబడి అధ్వానంగా ఉన్న ఎస్పీ కార్యాలయానికి మోక్షం లభించిందని మంత్రి తెలిపారు.