ETV Bharat / state

అలా ముగిసింది ...ఇలా మొదలైంది

కడప నగరపాలక సంస్థ,  ఏడు పుర సంఘాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. మార్చి 10 ఓటింగ్ జరగనుండగా.. 14న ఓట్ల లెక్కింపు ఉంటుందని అధికారులు వెల్లడించారు.

municipal elections
కడప మున్సిపల్ ఎన్నికలు
author img

By

Published : Feb 16, 2021, 10:29 AM IST

పుర సంఘాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. గతేడాది మార్చిలో కరోనా వ్యాప్తి కారణంగా మధ్యలో నిలిచిపోయిన ఎన్నికలను తిరిగి కొనసాగించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయించింది. ప్రస్తుతం జిల్లాలో కడప నగరపాలక సంస్థ, 6 పురపాలక సంఘాలు, 3 నగర పంచాయతీలు ఉన్నాయి.

వీటిలో రాజంపేట పురపాలక సంఘంతోపాటు కమలాపురం నగర పంచాయతీకి ఎన్నికలు జరగడం లేదు. రాజంపేటలో వార్డుల పునర్విభజనపై కోర్టు కేసు ఉండడంతో జరగడంలేదు. కమలాపురం నగర పంచాయతీ కొత్తగా ఏర్పడడంతో ఎన్నికల నిర్వహణ సాధ్యపడలేదు.

2020, మార్చి 9వ తేదీన జిల్లాలో కడప నగరపాలక సంస్థతోపాటు ప్రొద్దుటూరు, పులివెందుల, రాయచోటి, మైదుకూరు, బద్వేలు పురపాలక సంఘాలు, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల నగర పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్‌ విడుదలైంది. అనంతరం నామినేషన్ల స్వీకరణ, పరిశీలన ప్రక్రియలు పూర్తిచేశారు. గతేడాది మార్చి 15వ తేదీన అప్పటివరకు జరిగిన ఎన్నికలను ఎక్కడికక్కడ నిలిపివేస్తున్నట్లు ఎస్‌ఈసీ ప్రకటించారు. ప్రస్తుతం వాటిని కొనసాగించనున్నారు.

ఈ ఏడాది మార్చి 2, 3వ తేదీల్లో నామపత్రాల ఉపసంహరణ చేపడతారు. 3న పోటీలో ఉన్న తుది అభ్యర్థుల జాబితాను ప్రదర్శిస్తారు. 10న పోలింగ్‌ నిర్వహించి, 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ప్రొద్దుటూరు పురపాలక సంఘంలో నామపత్రాల పరిశీలన ముగిసే నాటికి ఒక వార్డులో ఒకే నామినేషన్‌ మాత్రమే మిగిలింది. ఫలితంగా 27వ వార్డులో వైకాపా అభ్యర్థి బంగారు మునిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఇక్కడ 41 వార్డుల్లో మొత్తం 288 నామినేషన్లు దాఖలు కాగా 12 తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన నామినేషన్లలో వైకాపా 105, తెదేపా 80, భాజపా 17, స్వతంత్రులు 67, ఇతర పార్టీలు 7 ఉన్నాయి. ఇక్కడ ఛైర్మన్‌ పదవిని బీసీ జనరల్‌కు రిజర్వేషన్‌ చేశారు. ఇప్పటికే వైకాపా తరఫున ఆర్వీ రమేష్‌కు ఛైర్మన్‌ అభ్యర్థిత్వం ఖరారైంది.
పులివెందుల పురపాలక సంఘంలో మొత్తం 33 వార్డుల్లో అధికార పార్టీ అభ్యర్థులు మాత్రమే బరిలో ఉండడంతో అవన్నీ ఏకగ్రీవమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఛైర్మన్‌ పదవిని బీసీ జనరల్‌కు రిజర్వేషన్‌ చేయగా వైకాపా అభ్యర్థిగా వరప్రసాద్‌ ఉన్నారు.
జమ్మలమడుగు నగరపంచాయతీలో తెదేపా అభ్యర్థులు ఒక్కరు కూడా నామినేషన్‌ దాఖలు చేయలేదు. గతేడాది స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలయ్యాక మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వైకాపా కండువా కప్పుకోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఇక్కడ వార్డు సభ్యుల స్థానాలకు వచ్చిన నామినేషన్లలో వైకాపా 67, భాజపా 29, జనసేన 7, స్వతంత్రులు 25, ఇతరులవి 3 ఉన్నాయి. ఇక్కడ ఛైర్మన్‌ పదవిని బీసీ మహిళకు రిజర్వేషన్‌ చేశారు. వైకాపా అభ్యర్థిగా శివమ్మను ఎంపిక చేశారు.
బద్వేలులో ఛైర్మన్‌ పదవిని జనరల్‌కు కేటాయించగా వైకాపా అభ్యర్థిగా రాజగోపాల్‌రెడ్డి ఉన్నారు.
రాయచోటిలో ఛైర్మన్‌ పదవిని జనరల్‌కు కేటాయించారు. ఎమ్మెల్సీ జకియా ఖానం బంధువును ఛైర్మన్‌ అభ్యర్థిగా ప్రకటించాలని వైకాపా అధిష్ఠానం గతేడాది భావించింది. ఎన్నికలు వాయిదా పడడంతో ఆ కుటుంబానికి ఎమ్మెల్సీ పదవి కేటాయించారు. ప్రస్తుతం వైకాపా అభ్యర్థి ఎవరనే దానిపై సందిగ్ధత ఉంది. ఇక్కడ వచ్చిన నామినేషన్లలో వైకాపా 81, తెదేపా 34, భాజపా 3, ఎంఐఎం 14, సీపీఐ 1, స్వతంత్రులు 40 మంది ఉన్నారు.

మైదుకూరు పురపాలక సంఘం ఛైర్మన్‌ పదవిని జనరల్‌కు కేటాయించారు. ఇక్కడ వైకాపా అభ్యర్థిగా శ్రీమన్నారాయణ, మాచనూరు చంద్ర పేర్లు ప్రచారంలో ఉన్నాయి.
ఎర్రగుంట్ల నగరపంచాయతీ ఛైర్మన్‌ పదవిని జనరల్‌గా ప్రకటించారు. వైకాపా అభ్యర్థిగా జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి బంధువు వ΄లె హర్షవర్ధన్‌రెడ్డిని ఎంపిక చేశారు. ఇక్కడ వచ్చిన నామినేషన్లలో వైకాపా 76, భాజపా 15, తెదేపా 8, స్వతంత్రులు 19, ఇతర పార్టీలు 3 ఉన్నాయి.

ఇదీ చదవండి: ఉప్పలపాడు @ ఆదర్శగ్రామం.. తోటి పల్లెలకు ఆదర్శం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.