ETV Bharat / state

Kadapa MP : గడప గడప కార్యక్రమంలో కడప ఎంపీ అవినాష్​ రెడ్డి.. - గడప గడప కార్యక్రమంలో ఎంపీ అవినాష్​

MP Avinash Reddy : మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్​ రెడ్డి.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. కడప జిల్లాలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో.. ఎంపీతో పాటు వైసీపీ శ్రేణులు, ఆయన అనుచరులు పాల్గొన్నారు.

Kadapa MP Avinash Reddy
ఎంపీ అవినాష్​ రెడ్డి
author img

By

Published : Apr 30, 2023, 1:58 PM IST

Kadapa MP Avinash Reddy : నిన్నటి వరకు సీబీఐ విచారణ.. కోర్టు కేసులు అంటూ బిజీ బిజీగా గడిపిన కడప ఎంపీ అవినాష్​ రెడ్డి.. ఈ రోజు ప్రజల మధ్య పర్యటిస్తున్నారు. మాజీ మంత్రి వైఎస్​ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్​ రెడ్డి.. నేడు ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కారించాలని అధికారులకను ఆదేశిస్తున్నారు.

కడప జిల్లాలో ఎంపీ అవినాష్​ రెడ్డి పర్యటిస్తున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. శనివారం రాత్రి సమయంలోనే హైదరాబాద్​ నుంచి స్వస్థలమైన పులివెందులకు చేరుకున్నారు. ఆదివారం వేకువజామున 6 గంటలకే తన పర్యటనను ప్రారంభించారు. వేంపల్లి మండలంలో ఆయన పర్యటన ప్రారంభించి.. ఆ మండలంలోని గ్రామాలను సందర్శిస్తున్నారు.

వేంపల్లికి చెందిన అయ్యవారిపల్లి గ్రామంలో ఆయన.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించి వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలు, వాటి వల్ల చేకూరే లబ్ది అందరికి అందుతుందో.. లేదో ప్రజల నుంచే తెలుసుకున్నారు. గ్రామస్థులు తమకున్న సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. స్థానికులు అడిగిన సమస్యలను అక్కడికక్కడే రాసుకుని.. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. త్వరలోనే ఆ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయనతో పాటు వైసీపీ కార్యకర్తలు, శ్రేణులు ఆయన అనుచరులు, అభిమానులు పాల్గొన్నారు.

వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్​ పాత్ర : మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్​ రెడ్డి పాత్ర ఉందని సీబీఐ ఆరోపిస్తోంది. హత్య కేసులో అవినాష్​ పాత్ర ఉంది అని అనటానికి సాంకేతిక ఆధారాలు ఉన్నాయని సీబీఐ గతంలోనే వెల్లడించింది. వివేకా హత్య జరిగిన ప్రాంతానికి అవినాష్​ రెడ్డి వచ్చారని తెలిపింది. వివేకాది హత్య కాదని.. గుండేపోటు అని చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు సీబీఐ వెలువరించింది. హత్య జరిగిన రోజు సాక్షాలను తారుమారు చేయటంలో అవినాష్​ రెడ్డి కీలకపాత్ర పోషించారని సీబీఐ ఆరోపిస్తోంది. ఉదయ్​ కుమార్​ తండ్రి.. జయ ప్రకాశ్​ చేత.. ఈ హత్య చేయించారని సీబీఐ పేర్కొంది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.