కరోనా మహమ్మారికి గురై మరణించిన ఓ వ్యక్తి మృతదేహానికి అధికారులు నిర్వహిస్తున్న అంత్యక్రియలను కడప జిల్లా రాయచోటిలో స్థానికులు అడ్డుకున్నారు. గాలివీడు మండలం నూలివీడుకు చెందిన 50 ఏళ్ల వయసు కలిగిన ఓ మత ప్రబోధకుడు తీవ్ర అనారోగ్యంతో ప్రభుత్వాసుపత్రిలో గురువారం రాత్రి చేరారు. చికిత్స పొందుతున్న అతను శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు. వైద్యాధికారులు కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. మృతదేహాన్ని పట్టణ సమీపంలోని గొల్లపల్లివాడ శ్మశాన వాటికకు తరలించారు. అదే సమయంలో గ్రామస్ఖులు శ్మశాన వాటికలో ఖననం చేయవద్దని అడ్డగించారు. అధికారులు నచ్చజెప్పిన వినకపోవటంతో చేసేదిలేక మృతదేహాన్ని మరో ప్రాంతానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించామని పట్టణ సీఐ జి. రాజు తెలిపారు.
ఇదీ చూడండి