ETV Bharat / state

వ్యాపారి హత్య కేసులో ముగ్గురు అరెస్టు - crime news in cadapa dst

ఈనెల 8న కడప మున్సిపల్ మార్కెట్ లో ఉల్లిపాయల వ్యాపారుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు హతమయ్యారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

kadapa dst police arrested culprits in murder case about the issue of onions selling

author img

By

Published : Jun 11, 2020, 1:15 AM IST

కడపలో ఈ నెల 8న హత్య జరిగింది. మార్కెట్ లో జరిగిన ఘర్షణలో ఉల్లిపాయల వ్యాపారి హతమయ్యారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... ఈనెల 8న మున్సిపల్ మైదానంలో తాత్కాలికంగా అధికారులు కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేశారు.

ఉల్లిపాయలు విక్రయించుకునే ఇద్దరు వ్యాపారస్తులు ధరలు పెంచి అమ్ముకునే విషయంలో గొడవ పడ్డారు. అబ్దుల్ సత్తార్, మహ్మద్ ఇజాజ్.. కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో మహ్మద్ ఇజాజ్ మృతి చెందాడు. ఈ మేరకు అబ్దుల్ సత్తార్ పై హత్య కేసు నమోదైంది. అతనితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.

ఇదీ చూడండి:

ఎమ్మెల్యే సుధీర్​రెడ్డికి తప్పిన ప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.