కడప జిల్లాలో కరోనా వైరస్ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని... జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిణి ఉమాసుందరి వెల్లడించారు. నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించే ప్రక్రియను వేగవంతం చేస్తున్నామన్నారు. జిల్లాలో త్రోట్ శ్యాంపిల్స్ ఇప్పటికే 8 వేలు దాటాయన్న డీఎంహెచ్వో... ట్రూనాట్, పీసీఆర్ కిట్ల ద్వారా రోజుకు 300 వరకు ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. జిల్లాలో మరో 5 ట్రూనాట్ కిట్లు అందుబాటులోకి రావడంతో ఫలితాలు మరింత వేగంగా వస్తాయంటున్న డీఎంహెచ్వో ఉమాసుందరితో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇవీ చదవండి: కరోనా ధాటికి ఆహార ఉత్పత్తి రంగం కుదేలు..!