కడప జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యాయని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. ఎన్నికలకు సంబంధించి ఒక్క కేసు కూడా నమోదు కాలేదని పేర్కన్నారు. చివరి దశ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం జమ్మలమడుగు అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడారు.
తుది దశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జమ్మలమడుగు, పులివెందుల నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్లు వెల్లడించారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘాతో పాటు అదనపు బలగాలు మోహరించిన కారణంగా.. ఎలాంటి గొడవలు జరగలేదని వివరించారు.
ఇదీ చదవండి:
పల్లె పోరు: ఇరువర్గాల ఘర్షణ.. లాఠీఛార్జ్‌తో అదుపు చేసిన పోలీసులు