ETV Bharat / state

కడప జిల్లాలో ఏకగ్రీవాలకు ఎత్తులు.. పైఎత్తులు - kadapa district unanimous news

కడప జిల్లాలో తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో ఎన్ని స్థానాలకు పోలింగ్ జరుగుతుందనేది నేడు తేలనుంది. అనంతరం తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించి గుర్తులు కేటాయించనున్నారు. పలు పంచాయతీల్లో ఒకరు మాత్రమే నామినేషన్ వేశారు. వాటిని అధికారులు ఏకగ్రీవంగా ప్రకటించటమే మిగిలింది. మరో వైపు పలుచోట్ల వైకాపా రెబల్స్‌ బరిలో ఉండి గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. రెండో విడత ప్రక్రియలో బుధవారం నామినేషన్ల దాఖలు జోరందుకుంది.

kadapa district panchayathi elections updates
కడప జిల్లాలో ఏకగ్రీవాలకు ఎత్తులు.. పైఎత్తులు
author img

By

Published : Feb 4, 2021, 5:01 PM IST

కడప జిల్లాలో తొలి దశలో ఎన్ని సర్పంచి, వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్‌ జరుగుతుందనేది నేడు (గురువారం) తేలనుంది. ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాల్లోని 206 పంచాయతీల్లో సర్పంచి, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ల ఉపసంహరణకు గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంది. అనంతరం పోటీలో ఉన్న తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించి గుర్తులు కేటాయిస్తారు. అప్పటి నుంచి అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో నిమగ్నం కానున్నారు. జిల్లాలో నామినేషన్ల స్వీకరణ పూర్తయ్యేనాటికి అయిదు పంచాయతీల్లో ఒకరే అభ్యర్థి బరిలో నిలిచారు. చాపాడు మండలం సీతారామపురం, దువ్వూరు మండలం పెద్దజొన్నవరం, ఎర్రబల్లె, సంజీవరెడ్డిపల్లి, బద్వేలు మండలం రాజుపాళెం పంచాయతీల్లో వైకాపా మద్దతుదారులే నామినేషన్‌ దాఖలు చేయగా అధికారులు వాటిని పరిశీలించి ఆమోదించారు. ఫలితంగా వీరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించనున్నట్లు తెలిసింది. జిల్లాలో మరికొన్ని స్థానాలను ఏకగ్రీవం చేసుకునేందుకు వైకాపా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తమ పార్టీలోనే రెబల్స్‌ను పోటీలో నుంచి తప్పించేందుకు నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యేలు స్వయంగా రంగంలోకి దిగి నచ్చజెప్పుతున్నారు. అయినా చాలామంది పోటీకే ఆసక్తి చూపుతున్నారు. రెబల్స్‌ బరిలో లేని చోట్ల ఇతర పార్టీల మద్దతుదారులు, స్వతంత్ర అభ్యర్థులతో ఏకగ్రీవాలకు ఒప్పందాలు చేసుకుంటున్నారు.

రెండో రోజు నామపత్రాల జోరు

పంచాయతీ ఎన్నికల రెండో విడత ప్రక్రియలో భాగంగా రెండో రోజైన బుధవారం నామినేషన్ల దాఖలు జోరందుకుంది. రెండో రోజు సర్పంచి స్థానానికి 362 మంది, వార్డు స్థానాలకు 1,274 మంది నామపత్రాలు దాఖలు చేశారు. తొలి రోజుతో కలిపి ఇప్పటివరకు సర్పంచి స్థానానికి 493, వార్డు స్థానానికి 1,438 మంది నామపత్రాలు దాఖలు చేసినట్లు కలెక్టర్‌ హరికిరణ్‌ తెలిపారు.

ప్రలోభాలకు తలొగ్గి... తప్పుకొంటున్నారు...

అట్లూరు మండలం ముతుకూరు సర్పంచి స్థానాన్ని వైకాపా మూడేళ్లు, తెదేపా మిగిలిన రెండేళ్లు అనుభవించేలా ఒప్పందం చేసుకుంటున్నారు. కుంభగిరి పంచాయతీలో రూ.12 లక్షలు తీసుకుని తెదేపా మద్దతుదారుడు నామపత్రం ఉపసంహరణకు ఊకొట్టినట్లు సమాచారం. కాశినాయన మండలం రంపాడు పంచాయతీలో తెదేపా మద్దతుదారుగా నామినేషన్‌ వేసిన జయమ్మను ప్రస్తుతం ఎమ్మెల్సీ గోవిందరెడ్డి తమ పార్టీ అభ్యర్థిగా బలపరుస్తున్నారు. ఇటీవల ఆమెతోపాటు కుటుంబసభ్యులు వైకాపా కండువా కప్పుకొన్నారు. ఇక్కడ సర్పంచి పదవి కోసం వైకాపా తరఫున ఆరుగురు పోటీ పడడంతో ఆయన ఇలా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తమకు ఎంపీటీసీ స్థానాన్ని ఇస్తే కలసపాడు సర్పంచి స్థానాన్ని ఏకగ్రీవం చేస్తామని స్థానిక తెదేపా నాయకులు ప్రతిపాదన తీసుకొచ్చారు.

ఉపసంహరించుకోవాలంటూ ఒత్తిడి...

బ్రహ్మంగారిమఠం మండలం కొత్తపల్లి తితిదే మాజీ ఛైర్మన్‌, తెదేపా మైదుకూరు నియోజకవర్గ బాధ్యుడు పుట్టా సుధాకర్‌యాదవ్‌ స్వగ్రామం. ఈ పల్లె పలుగురాళ్లపల్లి పంచాయతీ పరిధిలోకి వస్తుండడంతో అక్కడ సర్పంచి స్థానానికి తెదేపా మద్దతుదారుడిగా నామినేషన్‌ వేసిన అభ్యర్థిని పోటీ నుంచి తప్పుకోవాలంటూ స్థానిక వైకాపా నాయకులు సూచిస్తున్నారు. అయితే ఆయన మాత్రం పోటీకే మొగ్గుచూపుతున్నారు. సోమిరెడ్డిపల్లె సర్పంచి స్థానానికి వైకాపా, తెదేపా మద్దతుదారులతోపాటు స్వతంత్ర అభ్యర్థి సైతం నామినేషన్‌ దాఖలు చేశారు. ఇక్కడ తెదేపా మద్దతుదారుడు నామపత్రం ఉపసంహరించుకుంటారని ప్రచారం జరుగుతుండడంతో స్వతంత్ర అభ్యర్థి బాలస్వామిపై వైకాపా నాయకులు ఒత్తిడి పెంచుతున్నారు. ‘ఆన్‌లైన్‌లో డీకేటీ భూములు తొలగిస్తాం. అటవీశాఖలో మీ కొడుకు ఉద్యోగాన్ని పీకేస్తాం. ఎలాంటి ఇబ్బంది రాకూడదనుకుంటే ఏకగ్రీవానికి సహకరించు. దీనికి బదులుగా నీకు చివరి రెండున్నరేళ్లు సర్పంచి పదవిని ఇస్తాం’ అంటూ ప్రతిపాదనలు తీసుకొచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వైకాపా మండల అధ్యక్షుడు వీరనారాయణరెడ్డికి గ్రామస్థాయి నాయకులతో పొసగడం లేదు. ఈ విషయం పార్టీ అధిష్ఠానం దృష్టికి సైతం వెళ్లినట్లు తెలుస్తోంది. తోట్లపల్లి, ముడుమాల, డి.నేలటూరు, చౌదరివారిపల్లి పంచాయతీల్లో వైకాపా రెబల్స్‌ పోటీలో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. చౌదరివారిపల్లె సర్పంచి స్థానం గత 40 ఏళ్లుగా ఏకగ్రీవమవుతున్నా ప్రస్తుతం మాత్రం వైకాపాలో వర్గ పోరు కారణంగా పోటీ నెలకొంది.

కీలకంగా మారుతున్న రెబల్స్‌...

చాపాడు మండలం ఎన్‌.ఓబాయపల్లి, రాజువారిపేట, మైదుకూరు మండలం విశ్వనాథపురం, తిప్పిరెడ్డిపల్లి పంచాయతీల్లో సర్పంచి పదవికి నామినేషన్లు వేసిన వైకాపా రెబల్స్‌ను బుజ్జగించేందుకు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ రెబల్స్‌ బరిలో ఉంటే తెదేపా వారికి మద్దతు ఇవ్వాలని భావిస్తోంది. ఖాజీపేటలో మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి, ఎమ్మెల్యే వర్గీయుల మధ్య ప్రధాన పోటీ ఉన్న చోట్ల తెదేపా డీఎల్‌ వర్గీయులకు మద్దతు ఇస్తోంది. దువ్వూరు మండలం మాచనిపల్లి సర్పంచి స్థానాన్ని ఏకగ్రీవం చేసుకోవడానికి వైకాపా ప్రయత్నిస్తోంది. ఇక్కడ తెదేపా అభ్యర్థి నామినేషన్‌ వేయగా ఉపసంహరించుకుంటే పదవిని చెరి సగం పంచుకుందామనే ప్రతిపాదన తీసుకొచ్చినట్లు సమాచారం. ప్రొద్దుటూరు మండలంలో కొత్తపల్లితోపాటు నంగునూరుపల్లి పంచాయతీల్లో వైకాపా రెబల్స్‌ బరిలో దిగనున్నారు. దొరసానిపల్లె, చౌటపల్లి, చౌడూరు, కామనూరు పంచాయతీల్లో రెబల్స్‌ను బుజ్జగించి ఏకగ్రీవం చేసుకునేందుకు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి కృషి చేస్తున్నారు. రాజుపాళెం మండలం కొర్రపాడు, కుమ్మరపల్లి పంచాయతీలు ఏకగ్రీవమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కలసపాడు మండలం రాజుపాళెం, శంకవరం సర్పంచి స్థానాలకు వైకాపా రెబల్స్‌ బరిలో ఉండి గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు.

ఇదీ చదవండి

అక్కడ 40 ఏళ్లుగా ఎన్నికలు లేవు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.