ETV Bharat / state

sonusood: నటుడు సోనూసూద్​ను కలిసిన ఎమ్మార్పీఎస్​ నేతలు

కరోనా విపత్తు సమయంలో ముందుండి ఎంతో మందికి సాయమందించిన ప్రముఖ నటుడు సోనూసూద్​ను కడప జిల్లా వీరబల్లి మండలం ఎమ్మార్పీఎస్​ నేతలు కలిశారు. వారితో పాటు.. రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ విద్యార్థి కూడా సోనూసూద్​ వద్దకు వెళ్లాడు. అతన్ని చూసి చలించిపోయిన నటుడు... అతని వైద్య ఖర్చులు భరిస్తానని హామీ ఇచ్చారు.

kadapa district MRPS leaders
నటుడు సోనూసూద్​ను కలిసిన ఎంఆర్పీఎస్​ నేతలు
author img

By

Published : Jun 27, 2021, 10:28 PM IST

కడప జిల్లా వీరబల్లి మండలానికి చెందిన ఎమ్మర్పీఎస్​ నేతలు సినీ నటుడు సోనూసూద్​ను ముంబైలోని అతని నివాసంలో కలిశారు. నరసింహులు, వర్ల వెంకటరమణ, రామ్మోహన్​, ప్రసాద్, సంజీవ, మురళీలు.. సోనూసూద్​ని కలిశారు. మండలంలోని గడికోట గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. తమ ఆహ్వానానికి నటుడు సానుకూలంగా స్పందించాడని పేర్కొన్నారు.

వైద్య ఖర్చులు నేనే భరిస్తా....

రెండేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో... గడికోట గ్రామం జల్లేవాండ్లపల్లెకు చెందిన వెంకటసాయి చంద్ర అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. వైద్యులు అతనికి ఆపరేషన్​ చేసి కాలుని తొలగించారు. అతనిని చూసి చలించిపోయిన సోనూసూద్​.. వైద్యం చేయించుకోమని అతనికి తెలిపారు. చికిత్స కోసం ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి పంపించి... కాలు బాగయ్యే వరకు అక్కడే ఉండాలని చెప్పారు. వైద్య ఖర్చులు తానే భరిస్తానని హామీ ఇచ్చినట్లు ఎమ్మార్పీఎస్​ నేతలు తెలిపారు.

ఇదీ చదవండి: VELUGONDA PROJECT: వెలకొండ ప్రాజెక్టు పనులపై జేసీ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.