రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా కడప అగ్నిమాపక శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు తమ వద్దనున్న మూడు బోట్లను సిద్ధం చేశారు. జిల్లాలో ఉన్న 12 అగ్నిమాపక కేంద్రాల్లోని సిబ్బందికి సూచనలు జారీ చేశారు.
లైఫ్ జాకెట్లు తదితర సామగ్రిని అందుబాటులో ఉంచారు. జిల్లా శివారు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచారు. వర్షాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:
మురుగు కాలువలో పడిపోయిన చూడి గేదె-రక్షించిన అగ్నిమాపక సిబ్బంది