దిశ చట్టంతో పాటు ఇతర మహిళా చట్టాలపై వారిని చైతన్యం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని... డీఎస్పీ నారాయణస్వామి పేర్కొన్నారు. కడప జిల్లా రాజంపేట పట్టణంలోని మన్నూరు పోలీస్స్టేషన్ ఆవరణలో సచివాలయ పోలీస్ సిబ్బంది, పోలీస్ మిత్ర, మహిళా వాలంటీర్లకు దిశ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ... మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని పరిష్కార మార్గాలు చూపాలని సూచించారు. సమస్యాత్మక సంఘటనలు తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. మహిళలు శారీరకంగా కంటే మానసికంగా దృఢత్వం కలిగి ఉండాలని సూచించారు. ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసంతో ముందుకు నడవాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి :